సౌదీ ప్రిన్స్ తలాల్ బిన్ అబ్దుల్ కన్నుమూత
- December 23, 2018
రియాద్ : సౌదీ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ (87) కన్నుమూశారు. రియాద్ లో తలాల్ బిన్ అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. మహిళల హక్కుల్లో సంస్కరణలకు తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. కింగ్ సల్మాన్కు తలాల్ బిన్ సోదరుడు. తలాల్ బిన్ 1960లలో తన చేతుల్లో ఉన్న కొన్ని రాచరికల అధికారాలతో..పాలనలో కీలక పాత్ర పోషించారు. ఈజిప్షియన్ అధ్యక్షుడు గమాల్ అబ్డెల్ నజీర్ పరిధిలోని బీరట్, కైరో అసమ్మతి రాకుమారుల సమూహానికి ఆయన నాయకత్వం వహించారు. ప్రిన్స్ తలాల్, కైరో రాకుమారుల మధ్య విబేధాలు వచ్చిన తరువాత తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ 1964లో తిరిగి సౌదీ అరేబియాకు వచ్చారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..