సౌదీలో తొలి మహిళా ఫైర్‌ ఫైటర్స్‌

- December 24, 2018 , by Maagulf
సౌదీలో తొలి మహిళా ఫైర్‌ ఫైటర్స్‌

జెడ్డా: ఇద్దరు మహిళలు సౌదీ అరేబియా తొలి ఫైర్‌ ఫైటర్స్‌గా అవతరించారు. కింగ్‌డమ్‌ విజన్‌ 2030లో భాగంగా మహిళా శక్తిని వెలికి తీసేందుకుగాను, తీసుకున్న చర్యల్లో ఇది కూడా ఓ భాగం. సౌదీ అరామ్‌కో, ఇద్దరు మహిళలకు ఫైర్‌ ఫైటింగ్‌ ఆపరేషన్స్‌లో శిక్షణ ఇవ్వడం జరిగింది. కింగ్‌డమ్‌లో ఈ తరహా శిక్షణ ఇదే తొలిసారి. మామూలుగా అయితే ఈ విభాగంలో పురుషులకే అవకాశాలుండేవి. ఇంజనీర్‌ ఘజియా అల్‌ దోస్సారి మాట్లాడుతూ, తన తండ్రి ఫైర్‌ ఫైటింగ్‌ ప్రోగ్రామ్‌ని చూసి ఆకర్షితురాలినై తాను ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. అబీర్‌ అల్‌ జబెర్‌ మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం రావడం పట్ల చాలా సంతోషంగా వుందన్నారు. సౌదీ అరామ్‌కో ప్రోగ్రామ్‌ మేనేజర్‌ ఘస్సాన్‌ అబు అల్‌ ఫరాజ్‌ మాట్లాడుతూ, ఇది చారిత్రక ఘట్టమని అన్నారు. ఫైర్‌ ఫైటర్స్‌గా ఇద్దరు మహిళలు ఎంపిక కావడం చాలా గొప్ప విషయమని అన్నారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com