డ్రగ్స్ స్మగ్లింగ్: జెడ్డా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అడ్డుకట్ట
- December 25, 2018
జెడ్డా:సౌదీ అరేబియాలోని జెడ్డా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అథారిటీస్, డ్రగ్స్ స్మగ్లింగ్ అటెంప్ట్స్కి అడ్డుకట్ట వేసింది. మొత్తం ఐదుసార్లు స్మగ్లింగ్ యత్నాల్ని అడ్డుకున్నారు అధికారులు. ఈ క్రమంలో 822 గ్రాముల హెరాయిన్, అలాగే అక్రమ డ్రగ్ షాబు మెథాంఫెటమైన్ పిల్స్ (1700 గ్రాములు) స్వాధీనం చేసుకోవడం జరిగింది. కస్టమ్స్ డైరెక్టర్ బందర్ అల్ రహీలి మాట్లాడుతూ ఓ మహిళ పొట్ట నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 81 హెరాయిన్ క్యాప్సూల్స్‌ని ఆమె తన పొట్టలో పెట్టుకుని, స్మగ్లింగ్‌కి యత్నించింది. మరో ఘటనలోనూ ఓ ప్యాసింజర్ కడుపులోంచి 72 క్యాప్సూల్స్‌ని వెలికి తీశారు. స్మగ్లర్ల బాడీ లాంగ్వేజ్‌ని స్టడీ చేసి, నిందితుల్ని గుర్తించడంలో ప్రతిభ చూపుతున్న అధికారుల్ని అల్ రహీలి అభినందించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..