అనాథల కోసం శాంతాక్లజ్ గా సచిన్..
- December 26, 2018
ముంబై : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్నారుల కోసం శాంతాక్లాజ్ అవతారం ఎత్తారు. క్రిస్మస్ వేడుక సందర్భంగా అనాధ పిల్లల కోసం ముంబయిలోని ఆశ్రయ్ ఛైల్డ్ కేర్ సెంటర్లోని చిన్నారులతో కలిసి ఆడిపాడారు. వారితో క్రికెట్ ఆడారు. వారితో గడిపిన ఆ క్షణాలు మరిచిపోలేనివని మురిసిపోయారు సచిన్ టెండూల్కర్. తెల్లని గెడ్డం..మీసాలు..ఎర్రని టోపీ పెట్టుకుని ఇంటిదగ్గర నుండి క్లాజ్ వేషంతోనే ఆనాథశ్రమానికి బయల్దేరారు. ఆశ్రయ్ ఛైల్డ్ కేర్ చిన్నారులతో సరదాగా సరదాగా క్రికెట్ ఆడుతూ వారిలో ఆనందాన్ని నింపారు. తరువాత వారికి ఇష్టమైన బ్యాట్లు, క్రికెట్ కిట్లతోపాటు బ్యాట్మింటన్ రాకెట్స్, ఫుట్బాల్స్లను వారికి క్రిస్మస్ బహుమతిగా అందించారు. సచిన్ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
''హో.. హో.. హో.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆశ్రయ్ చైల్డ్ కేర్ సెంటర్లో చిన్నారులతో కలిసి గడపడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చిందనీ..వారి అమాయకమైన ముఖాలపై ఆనందం వెలకట్టలేనిది'' అంటూ సచిన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు