90 శాతం డిస్కౌంట్స్.. డిఎస్ఎఫ్ నేడే ప్రారంభం
- December 26, 2018సిటీ వైడ్ ప్రమోషన్స్, మాసివ్ సేల్స్, ఫైర్ వర్క్స్ మళ్ళీ దుబాయ్‌లో సందడి చేయనున్నాయి. 24వ ఎడిషన్ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నేడే ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 2 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. 700కి పైగా బ్రాండ్స్ ఈ షాపింగ్ ఫెస్టివల్లో షాపింగ్ ప్రియుల కోసం కొలువుదీరాయి. 3,200 ఔట్లెట్స్ సిటీ వ్యాప్తంగా ఈ సేల్‌లో పాల్గొంటున్నాయి. 90 శాతం వరకు డిస్కౌంట్స్ ఈ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకత. 12 గంటల సేల్‌తో ప్రారంభమవుతున్న షాపింగ్ ఫెస్టివల్, 90 శాతం వరకు సేల్స్‌ని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వద్ద అందిస్తోంది. సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ డేరా, సిటీ సెంటర్ మైసీమ్, సిటీ సెంటర్ బర్షా, సిటీ సెంటర్ అల్ షిందఘా తదితర మాల్స్‌లోనూ ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ఈ అద్భుతమైన సేల్ కొనసాగుతుంది. రేపటినుంచి దుబాయ్ వీకెండ్ సర్ప్రైజెస్ సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. ప్రతి గురు, శుక్రవారాల్లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా ఫైర్ వర్క్స్ ప్రధాన ఆకర్షణ కానున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..