ముదురుతున్న 'మెగా-నందమూరి' వివాదం
- December 26, 2018
తెలుగు ఇండస్ట్రీలో సినీ తారలంతా మేం ఒక్కటే..అభిమానులు తమ గురించి గొడవ పడకండీ అంటూ తెగ లెక్చర్ ఇస్తుంటారు. కొన్ని సార్లు మాత్రం వీరి మద్య వివాదాలు చూస్తుంటే మాత్రం ఇండస్ట్రీలో ఇన్ని వివాదాలు ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతుంటాయి. ఈ మద్య మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య సైలెంట్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో బాలయ్య ఓ సందర్భంలో పవన్ కళ్యాన్ ఎవరూ తనకు తెలియదని అనడం పెద్ద వివాదం సంతరించుకుంది. దీనికి కౌంటర్ గా ఈ మద్య మెగా బ్రదర్ నాగబాబు తనకు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పి..సారీ సీనియర్ నటులు బాలయ్య తనకు బాగా తెలుసని అన్నారు.
అప్పటికే నందమూరి ఫ్యాన్స్ నాగబాబుని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత మరో వీడియో రిలీజ్ చేస్తూ..తనకు బాలకృష్ణ తెలయదని పొరపాటున అన్నానని..వాస్తవానికి బాలకృష్ణ గొప్ప కమెడియన్ అని..సీనియర్ ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించారని..పాత చిత్రాల్లో కమెడియన్ గా నటించిన వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించారు. దాంతో నందమూరి అభిమానుల్లో మరింత ఆగ్రహించారు. ఇది చాలదన్నట్లు నాగబాబు మళ్లీ బాలయ్యను ఉద్దేశించి పరోక్ష విమర్శ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. దేశభక్తి గీతమైన 'సారా జహా సె'ను ఓ బాలుడు పాడుతున్న వీడియో అది.బాలయ్యను ఎద్దేవా చేయడానికే పోస్ట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
ఆ మద్య తెలంగాణ ఎన్నికల సమయంలో బాలకృష్ణ 'సారా జహా సె'ను సరిగ్గా పాడలేక 'బుల్ బుల్.. ' అని పలికి ట్రోల్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ చిన్న బాలుడు 'సారా జహా సె' అంటూ చక్కగా పాడాడు..అంటూ ఎద్దేవా చేసినట్లు ఉందని ఫిలిమ్ వర్గాలు అంటున్నారు. కాకపోతే ఆ బాలుడు పాడిన పాటలో 'బుల్ బులే హై ఇస్‌కే' వాక్యం లేదు! పిల్లాడు మరచిపోవడం వల్ల అలా జరిగిందో లేకపోతో మరో కారణం వల్లజరిగిందో తెలియడం లేదు. ఇప్పుడు ఇది మరోసారి నందమూరి ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించేలా ఉందని అంటున్నారు సినీ అభిమానులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!