ఆంటీ అంటూ నన్ను ఎవరైనా పిలిస్తే…షూట్ చేయండి: స్మ్రుతి ఇరానీ
- December 28, 2018
ప్రస్తుత కాలంలో చాలామంది యువతులకైనా, యువకులకైనా ఎంత వయసు పెరిగినా కూడా ఆంటీ, అంకుల్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు. వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తనకు కూడా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టముండదు అంటూ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఎయిర్ పోర్టులో అనుకోకుండా స్మృతి ఇరానీ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కలిశారట. దీంతో ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారట. 'జాన్వీ కపూర్ నన్ను ఆంటీ అని సంబోధిస్తూ మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నాక ఆంటీ అని పిలిచినందుకు సారీ కూడా చెప్పింది. అప్పుడు నేనేం ఫర్వాలేదు అంటూ సర్ది చెప్పాను. ఈ కాలం పిల్లలు ఉన్నారే… ఆంటీ అంటూ ఎవరైనా పిలిస్తే… ఎవరైనా నన్ను షూట్ చేయండి అని గట్టిగా అరవాలన్పిస్తుంది…' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు స్మృతీ ఇరానీ. ప్రస్తుతం ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో, 'తక్త్' అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







