అల్లు శిరీష్ - 'ఎబిసీడీ' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
- December 28, 2018
అల్లు శిరీష్, కృష్ణార్జున యుద్ధం ఫేమ్, రుక్సార్ థిల్లాన్ జంటగా, సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, పెళ్ళి చూపులు ఫేమ్, యష్ రంగినేని కలిసి నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు సమర్పిస్తున్న సినిమా, ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ) అనేది ట్యాగ్ లైన్.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్‌ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
అల్లు బాబు ఓ రోడ్‌లో స్కేటింగ్ చేస్తూ, స్టైల్‌గా సలాం చేస్తున్నాడు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో.. ఇక మోషన్ పోస్టర్‌లో అయితే, రోడ్లపై స్కేటింగ్‌తో రకరకాల విన్యాసాలు చేసాడు. ధనవంతుడైన ఒక కుర్రాడు, పేదవాడిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే పాయింట్‌తో మలయాళంలో తెరకెక్కిన ఏబీసీడీ మూవీని, అదే పేరుతో తెలుగులో అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నారు..
హీరోగా నిలదొక్కుకోవడానికి కిందా మీదా పడుతున్న శిరీష్, ఈ సినిమా తనకి బ్రేక్ ఇస్తుందనే హోప్‌తో ఉన్నాడు. 2019 ఫిబ్రవరిలో ఏబీసీడీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి మాటలు : కళ్యాణ్ రాఘవ్, కెమెరా : రామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







