ఫేక్‌ కాప్‌కి ఆరు నెలల జైలు శిక్ష

- December 29, 2018 , by Maagulf
ఫేక్‌ కాప్‌కి ఆరు నెలల జైలు శిక్ష

దుబాయ్‌ క్రిమినల్‌ కోర్టు, ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్‌ చేసిన నిందితుడు, ఓ మహిళ పాదాల్ని ముద్దాడి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్‌ చేసిన కేసులో న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. నిందితుడు పోలీస్‌ గెటప్‌లో బాధితుల్ని వేధించినట్లు విచారణలో నిరూపితమయ్యింది. నైఫ్‌ ప్రాంతంలోని ఓ మెట్రో స్టేషన్‌లో బాధితుల్ని తనను కలవాల్సిందిగా కోరిన నిందితుడు, వారిపై దాడి చేసి, అతని వాహనంలో తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వారిని ఓ ప్రాంతానికి తీసుకెళ్ళి మహిళ పాదాల్ని ముద్దాడించి, క్షమాపణ చెప్పించాడు. అయితే ఎందుకలా చేశాడన్నదానిపై విచారణాధికారులు వెల్లడించలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com