మహేష్ కు ఐటి టీం షాక్..పి.ఆర్ టీం కు గట్టిగా వార్నింగ్
- December 30, 2018
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మహేష్ కెరియర్ లో 25వ సినిమా కావడం చేత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలాఉంటే షెడ్యూల్ కు చిన్న గ్యాప్ ఇచ్చి జాలీ ట్రిప్ కు వెళ్లిన మహేష్ కు ఐటి టీం షాక్ ఇచ్చింది. యాడ్స్ కు వచ్చిన రెమ్యునరేషన్ లో మహేష్ 2007-08 ఇయర్ నుండి ట్యాక్స్ చెల్లించలేదని ఈమధ్య వార్తలు వచ్చాయి. దానికి సంబందించి మహేష్ కు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా రెస్పాన్స్ లేకపోయేసరికి చివరకు మహేష్ ఎకౌంట్స్ సీజ్ చేసే పరిస్థితి వచ్చింది.
ఈ విషయం పై మహేష్ చాలా సీరియస్ గా ఉన్నాడట. తను సిటీలో లేని ఈ టైంలో ఇలా జరగడం ఏంటని ఆరా తీస్తున్నాడట. అంతేకాదు దీని వెనుక ఎవరి హస్తం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ముందు తన పి.ఆర్ టీం కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట మహేష్. కేవలం 73 లక్షల గురించి మహేష్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేశారు.
ముందుగా పి.ఆర్ టీం ఈ న్యూస్ వైరల్ అవకుండా జాగ్రత్త పడితే బాగుండేది. అసలైతే రాజమౌళి తనయుడి పెళ్లికి అటెండ్ అవ్వాల్సి ఉన్నా ఈ గొడవల వల్ల మహేష్ మళ్లీ దుబాయ్ కు వెళ్లాడట. అందుకే మహేష్ తరపున తన టీం ఈ వివాదంపై వివరణ ఇచ్చుకుంది. మరి ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







