చంద్రునిపై చైనా స్పేస్ క్రాఫ్ట్

- December 30, 2018 , by Maagulf
చంద్రునిపై చైనా స్పేస్ క్రాఫ్ట్

చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక-' చేంజ్-4 ' చంద్రుడి కక్ష్యలో ప్రవేశించింది. తన అంతరిక్ష కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చైనా జరుపుతున్న ప్రయత్నాల్లో ఇదో ముందడుగని సిన్ హువా వార్తా సంస్థ ప్రకటించింది. అయితే చంద్ర మండలంలో ఎవరికీ ' కనిపించని డార్క్ సైడ్ ' లో ఈ నౌక అడుగుపెట్టనుందని, గతంలో పంపిన స్పేస్ క్రాఫ్ట్ ఇలాంటి ప్రదేశాన్ని తాకలేదని ఈ సంస్థ పేర్కొంది.

అతి పొడవైన ' మార్ట్-3 బీ ' రాకెట్ ని చైనా ఈ నెలారంభంలో ప్రయోగించింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున ఈ అంతరిక్ష నౌక..చంద్రుని ఉపరితలానికి సుమారు 15 కి.మీ. దూరంలోని కక్ష్యకు చేరుకుంది. చంద్ర మండలం పైని భూభాగం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ఖనిజాలు, న్యూట్రాన్ రేడియేషన్, న్యూట్రాన్ యాటమ్స్ వంటి వాటి విశేషాలను ఈ నౌక అధ్యయనం చేస్తుందని చైనా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 2030 నాటికి అంతరిక్షంపై రష్యా, అమెరికా దేశాలతో సమానంగా తామూ పట్టు సాదించాలన్నదే చైనా లక్ష్యం. వచ్చే ఏడాది తన సొంత మానవ సహిత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని కూడా ఆ దేశం యోచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com