యూఏఈలో ఇండియన్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

- December 31, 2018 , by Maagulf
యూఏఈలో ఇండియన్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

35 ఏళ్ళ ఇండియన్‌ మ్యాన్‌ తన అకామడేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రస్‌ అల్‌ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్‌ ఫోన్‌లో సూసైడ్‌ నోట్‌ లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడి పేరు రినోజ్‌ రాజేంద్రన్‌. షార్జాలోని ఓ జ్యుయెలరీ ఫర్మ్‌లో రాజేంద్రన్‌ భార్య బిని బెనర్జీ పనిచేస్తున్నారు. అనారోగ్య సమస్యలతోనే రాజేంద్రన్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్‌ నోట్‌ ద్వారా అర్థమవుతోంది. మృతుడికి ఓ కుమారుడు వున్నాడు. అతను కేరళలో వుంటున్నాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని మృతుడు, సూసైడ్‌ నోట్‌లో పేర్కొనట్లు అధికారులు తెలిపారు. మృతుడు గతంలో అల్‌ ఘైయల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో పనిచేశారు. అతను చాలా డెడికేటెడ్‌ అని సన్నిహితులు పేర్కొన్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com