అమల్లోకి వచ్చిన సీపీ టిపిపి వాణిజ్య ఒప్పందం
- December 31, 2018
టోక్యో : అమెరికాను దూరంగా పెట్టి పదకొండు దేశాలు కలసి కుదుర్చుకున్న తాజా ట్రాన్స్ పసిఫిక్ వాణిజ్య ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదవ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 దేశాలు కలసి గత మార్చిలో ఈ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ట్రాన్స్ పసిఫిక్ ఏరియాలో సభ్య దేశాలు తమ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం సాగించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. కీలక రంగాలకు సంబంధించిన 95 రకాల వస్తువుల దిగుమతులపై సుంకాలను పూర్తిగా తొలగిస్తారు. వరి, బీఫ్ వంటి వాటిపై కొంత నియంత్రణ ఉంటుంది. అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక చర్యలు (ప్రొటెక్షనిజం), చైనాపై అది సాగిస్తున్న వాణిజ్య యుద్ధం దరిమిలా ఆసియా పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, మెక్సికో, న్యూజిలాండ్ సింగపూర్ మొదట ఈ ఒప్పందానికి ఆమోదం తెలపగా, తరువాత వియత్నాం మరి కొన్ని దేశాలు ఇందులో వచ్చి చేరాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..