యూఏఈలో ఇండియన్ అకౌంటెంట్ ఆత్మహత్య
- December 31, 2018
35 ఏళ్ళ ఇండియన్ మ్యాన్ తన అకామడేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రస్ అల్ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్లో సూసైడ్ నోట్ లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడి పేరు రినోజ్ రాజేంద్రన్. షార్జాలోని ఓ జ్యుయెలరీ ఫర్మ్‌లో రాజేంద్రన్ భార్య బిని బెనర్జీ పనిచేస్తున్నారు. అనారోగ్య సమస్యలతోనే రాజేంద్రన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా అర్థమవుతోంది. మృతుడికి ఓ కుమారుడు వున్నాడు. అతను కేరళలో వుంటున్నాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని మృతుడు, సూసైడ్ నోట్లో పేర్కొనట్లు అధికారులు తెలిపారు. మృతుడు గతంలో అల్ ఘైయల్ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేశారు. అతను చాలా డెడికేటెడ్ అని సన్నిహితులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







