'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్
- December 31, 2018

మంచి నటుడు అనిపించుకొన్న శ్రీ విష్ణు.. హీరోగా నిలదొక్కునే ప్రయత్నంలో ఉన్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో లాంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకొన్నాడు. ఆయన తాజా 'బ్రోచేవారెవరురా'. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు.
ఇదో క్రైమ్ థ్రిల్లర్. ఇందులో శ్రీ విష్ణుకి జంటగా నివేదా ధామస్, నివేదా పేతురాజ్‌లు నటిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ లో నీలం రంగులో ఉన్న దిష్టిబొమ్మను చూపిస్తూ.. దాని కింద 'ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి..ఊళ్లోవాళ్లందరి దిష్టి ఈ 2019లో మీకెవ్వరికీ తగలకూడదని ఆశిస్తూ శుభంభూయాత్' అని రాశారు. ఆకట్టుకొనేలా ఉన్న ఫస్ట్ లుక్ పై మీరు ఓ లుక్కేయండీ.. !
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







