అట్టహాసంగా రాజమౌళి కుమారుడి వివాహం
- December 31, 2018
జయపుర: దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు. ముందస్తు పెళ్లి వేడుక నుంచి చివరి ఘట్టం వరకు తారక్, ప్రభాస్, చరణ్, రానా రాజమౌళి కుటుంబీకులతో కలిసి రచ్చ చేశారు. డ్యాన్సులతో సందడి చేశారు. కాగా..రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో పెళ్లి కుమార్తె కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్ కూడా మోశారు. పెళ్లి వేడుకలో ప్రభాస్, అనుష్క సందడి చేశారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..