కొత్త సంవత్సరం కానుకగా రాజశేఖర్ 'కల్కి'ఫస్టులుక్!
- December 31, 2018
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్ గా ఎంట్రీ ఇచ్చి 'అంకుశం'చిత్రంతో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్. ఆ తర్వాత ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించిన రాజశేఖర్ ఫ్యామిలీ హీరోగా మారారు. తన సహనటి జీవితను వివాహం చేసుకున్న తర్వాత పలు చిత్రాలు కూడా నిర్మించారు. రాజశేఖర్ నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ మద్య 'గరుడ వేగ' లాంటి యాక్షన్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ మంచి విజయాన్ని అందుకున్నారు.
'గరుడ వేగ' హిట్ తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రశాంత్ వర్మ వినిపించిన ఈ కథ నచ్చడంతోనే మరోచిత్రానికి సిద్దమయ్యారు. ఈ చిత్రం టైటిల్ 'కల్కి' దీనికి సంబంధించిన లోగో ఆ మద్య రిలీజ్ చేశారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రాజశేఖర్ యాక్షన్ మార్క్ తో కూడినదిగా ఈ చిత్రం ఉండబోతుందట.
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం కూడా తనకి హిట్ ఇస్తుందనే పూర్తి నమ్మకంతో రాజశేఖర్ వున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







