శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు
- January 02, 2019
తిరువనంతపురం: కేరళలో సమానత్వం కోసం మానవ హారం చేపట్టి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళలు మరో గెలుపుకు నాంది పలికారు. కేరళలో శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు ప్రవేశించడం ద్వారా వారు చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారు జామున శబరిమలను సందర్శించారు. గత నెలలో వీరిద్దరూ శబరిమల సందర్శించడానికి రాగా, నిరసనల వెలువెత్తడంతో వెనుదిరిగారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీపరిచాయి. గత అర్థరాత్రి నుండి ఆలయ ప్రవేశానికి సమాయత్తమయ్యారు. తెల్లవారు జామున అయ్యప్ప గర్భగుడిలోకి చేరి పూజలు చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







