ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
- January 02, 2019
'బాహుబలి' తర్వాత ప్రభాస్.. ఆ రేంజ్ సినిమాలే ప్లాన్ చేసుకొంటున్నారు. దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో 'సాహో' తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక, రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం కూడా భారీ బడ్జెట్ సినిమాయే. ఈ సినిమాని బాహుబలి రేంజ్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత కూడా ప్రభాస్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నంలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఇటీవల ప్రశాంత్ నీల్ వెళ్లి ప్రభాస్ తో ఓ క్యాజువల్ భేటీ వేశారు. దానివెనుక దిల్ రాజు వున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ కనుక మాంచి సబ్జెక్ట్ తో ప్రభాస్ ను ఒప్పించగలిగితే, ఎంతయినా పెట్టి ప్రొడక్షన్ చేసేందుకు దిల్ రాజు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రభాస్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా రావడం ఖాయం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







