టోక్యోలో నూతన సంవత్సర వేడుకలపై దాడి..8 మందికి గాయాలు
- January 02, 2019
టోక్యో: జపాన్‌లో నూతన సంవత్సర ప్రారంభ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి టోక్యోలో వేడులకు జరపుకుతుంటున్న వారిపైకి కౌజిరలో కుసాకబె అనే 21 ఏళ్ల యువకుడు వేగంగా కారు పోనివ్వడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మొదట్లో దీనిని ఉగ్రవాద చర్యగా భావించి, నగరంలో ప్రవేశించే దారులన్నిటినీ మూసివేశారు. ఓ మత ఛాందస వాదికి ఉరి శిక్ష విధించడానికి నిరసనగా ఆ మతఛాందసవాద సంస్థకు చెందిన సభ్యులు ఈ ప్రతీకారానికి పాల్పడినట్లు పోలీసులు తరువాత నిర్ధారించారు. 1995లో టోక్యో సబ్‌వేలో శరీన్ విషయవాయు ప్రయోగం కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో కొందరికి గత ఏడాది ఉరి శిక్ష విధించారు. దీనికి ప్రతిగా ఈ కారు దాడికి దిగిన కుసాకబే పై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







