కేటీఆరే స్పూర్తి తో రాజకీయాల్లోకి వస్తా : ప్రకాష్ రాజ్
- January 02, 2019హైదరాబాద్: తన రాజకీయ ప్రయాణానికి కేటీఆర్ స్పూర్తి అని సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన మరునాడే సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం నాడు హైద్రాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.తన రాజకీయ ప్రయాణం ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని ఆయన తేల్చి చెప్పారు. గతంలో కేసీఆర్‌తో కలిసి ప్రకాష్ రాజ్ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడలను కలిశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై ప్రకాష్ రాజ్ గతంలో పలుమార్లు ప్రశంసలు కురిపించారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే విషయమై ఆయన త్వరలోనే వెల్లడించనున్నట్టు ప్రకాష్ రాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..