కేరళలో ఉద్రిక్త పరిస్థితులు

- January 03, 2019 , by Maagulf
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనను నిరసిస్తూ కేరళలో బంద్‌ నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ కేరళలో అయ్యప్ప భక్తులు ఆందోళనలు చేస్తున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కాలికట్‌, కన్నూర్‌, తిరువనంతపురం, పాలక్కాడ్‌ జిల్లాల్లో నిరసనకారులు బస్సులపై, ప్రభుత్వ కార్యాలయాలపై రాళ్లు రువ్వుతున్నారు. నిరసనకారుల దాడిలో 60 బస్సులు ధ్వంసమయ్యాయి. దీనితో కెఎస్‌ ఆర్‌టిసి బస్సు సర్వీసులను నిలిపివేసింది. మలప్పురంలో సిపిఎం కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేస్తున్నారు. పోలీసులు 8 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com