మోడీ బయోపిక్ కి టైటిల్ ఖరారు
- January 04, 2019
బాలీవుడ్లో బయోపిక్ ల జోరు మరింత ఊపందుకుంటోంది. ఇప్పటికే కొన్ని బయోపిక్ లు సెట్స్ పై ఉండగా, మరికొన్ని బయోపికలు సెట్స్ పైకి వెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. నరేంద్ర మోడీ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకి 'పీఎమ్ నరేంద్ర మోడీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సందీప్ సింగ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలనున్నారు. ఈ నెల 2వ వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఒక సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోడీ, అంచలంచెలుగా ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి రావడం వెనుక ఆయన కృషి .. పట్టుదల .. లక్ష్య సాధన ఎంతో వున్నాయి. వాటన్నింటినీ ఈ బయోపిక్ లో చూపించనున్నారట.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







