కింగ్‌డమ్‌ని సందర్శించిన 10.3 మిలియన్ పర్యాటకులు
- January 04, 2019
బహ్రెయిన్:2018 ఏడాదిలో 10.3 మిలియన్ టూరిస్టులు బహ్రెయిన్‌లో పర్యటించారు. 2017తో పోల్చితే, 2018లో 10.3 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం ద్వారా కింగ్డమ్లో పర్యాటకం ఆశించిన రీతిలో వృద్ధి చెందుతోందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మరియు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. టూరిస్టులు బహ్రెయిన్‌లో మొత్తం 9.8 మిలియన్ రోజులు స్పెండ్ చేసినట్లయ్యింది. ఇది 22.3 శాతం అధికం గత ఏడాదితో పోల్చి చూస్తే. 2018 తొలి తొమ్మిది నెలల్లో 9.1 మిలియన్ పర్యాటకులు వచ్చినట్లు నిర్ధారితమయ్యింది. గత ఏడాది ఈ కాలంతో పోల్చితే 5.7 శాతం పెరుగుదల ఈ ఏడాది నమోదయ్యింది. వాటెల్ హెటల్, టూరిజం బిజినెస్ స్కూల్ వంటి వాటిని ఈ ఏడాది బహ్రెయిన్ ప్రారంభించింది. ఇవన్నీ టూరిజం వృద్ధికి ఉపకరిస్తున్నాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!