కేరళ:1369 మంది అరెస్టు..
- January 04, 2019
తిరువనంతపురం: రెండు రోజుల క్రితం ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత కేరళ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు జరిగాయి. ఇవాళ కూడా అక్కడ బంద్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు సుమారు 1369 మందిని అరెస్టు చేశారు. మరో 717 మందిని ముందస్తుగా ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 801 కేసులను నమోదు చేశారు. మునుముందు మరికొంత మందిని అదుపులోకి తీసుకోనున్నట్లు కేరళ పోలీసులు చెప్పారు. భారీ హింస చోటుచేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలను కూడా ఎవరూ తెరవడం లేదు. పోలీసులు భద్రత కల్పిస్తేనే షాపులను తెరుస్తామని యజమానులు అంటున్నారు. దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించినా.. తగినంత భద్రతను కల్పించలేకపోయారన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..