ఆసియా కమ్యూనిటీ ప్రతినిధుల కోసం 'ఎంఓఐ' సెమినార్
- January 04, 2019
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దేశంలోని ఏషియన్ కమ్యూనిటీస్ ప్రతినిధుల కోసం అవేర్‌నెస్ సెమినార్ ఏర్పాటు చేసింది. మినిస్ట్రీకి సంబంధించిన పలు డిపార్ట్‌మెంట్స్ ఈ సెమినార్‌లో పాల్గొన్నాయి. యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ అందిస్తున్న, ప్రవేశపెడుతున్న సర్వీసులు సహా పలు అంశాలపై ఈ సెమినార్‌లో చర్చ జరిగింది. డ్రగ్స్ వాడకంతో తలెత్తే సమస్యలు, రోడ్ మరియు పబ్లిక్ సేఫ్టీ, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ఈ సెమినార్‌లో పలు మిషన్స్‌కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చింది. దేశంలోని తమకు చెందిన 16 కేంద్రాల ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి సంబంధించిన సేవలు అందిస్తున్నట్లుగా తెలిపింది. పాదచారుల భద్రత వాహనాలు నడిపే సమయంలో భద్రత వంటి అంశాలపైనా, అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ నిబంధనలు చర్చకు వచ్చాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అగ్ని ప్రమాదాలపై ప్రజెంటేషన్ ఇచ్చింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్