సెన్సార్ పూర్తి చేసుకున్న "ఎన్టీఆర్-కథానాయకుడు"..9న గ్రాండ్ గా విడుదల..!!
- January 05, 2019
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఎన్టీఆర్-కథానాయకుడు" చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని 'U' సర్టిఫికేట్ ని పొందింది.. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా 2 గంటల యాభై నిమిషాల నిడివితో చిత్రం జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.. విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి , సుమంత్, కళ్యాణ్ రామ్ తదితరులు చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో మంచి స్పందన దక్కించుకోగా సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం తదితరులు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







