శబరిమలలో హై టెన్షన్
- January 05, 2019
శబరిమల: శబరిమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో సీపీఎం..బీజేపీ నాయకుల ఇళ్లపై బాంబులు, రాళ్లతో ఆందోళన కారులు దాడులు విరుచుకుపడుతున్నారు. శబరిమలలో మహిళల అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకున్న క్రమంలో ప్రభుత్వంపై శబరిమల ఆలయ పరిరక్షణ సమితి మండి పడుతోంది. ఆలయంలోకి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై కేరళలో తీవ్రస్థాయిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆందోళనకారులు సీపీఎం నేతల ఇళ్లపై నాటుబాంబులు, రాళ్లతో దాడులకు దిగుతున్నారు. ఈ ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. ఇప్పటివరకు 801 కేసులు నమోదు చేశారు. 1369 మందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు శబరిమల అంశంపై ఆందోళనల్ని ఉధృతమయ్యాయి. మహిళలకు అయ్యప్ప దర్శనంపై చెలరేగుతున్న వివాదం అంతకంతకు క్రిటికల్ గా తయారవుతోంది. ఈ క్రమంలో శబరిమల పరిరక్షణ సమితి జనవరి 11, 12, 13 తేదీల్లో మకరవిలక్కు రోజైన 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 8 కోట్ల మకర జ్యోతుల ప్రజ్వలన, 18న సచివాలయ ముట్టడికి శబరిమల పరిరక్షణ సమితి పిలుపు నిచ్చింది. రథయాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో శబరిమలలో జనవరి 4న కూడా ఆందోళనలు కొనసాగాయి. హిందూ సంస్థలు, లెఫ్ట్ కార్యకర్తల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. కోజిక్కోడ్‌లోని మలబార్ దేవస్వం బోర్డు సభ్యుడు కె.శశికుమార్ నివాసంపై కొందరు నాటుబాంబులు విసిరారు. పథనంతిట్టలోని అదూర్‌లో ఒక మొబైల్ ఫోన్ల దుకాణంపైనా బాంబులు వేశారు. సమస్యాత్మకమైన కన్నూరులో మొత్తం నాలుగుచోట్ల బాంబులు..రాళ్లు దాడులలో ఇప్పటివరకు ఏడుగురు తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. ఈ ప్రాంతంలో వున్న బీజేపీ కార్యాలయానికి ఆందోళకారులు నిప్పంటించారు. పథనంతిట్ట, కన్నూరు, కోజిక్కోడ్, తిరువనంతపురం జిల్లాల్లో బీజేపీ, లెఫ్ట్ కార్యకర్తలు ఒకరి నివాసాలపై మరొకరు రాళ్ల దాడులు చేసుకున్నారు.
ఉద్రిక్తత కొన్ని ప్రాంతాల్లో సాగుతున్న కూడా తలాసేరీ కేరళ లో కన్నూర్ లో మహిళల ప్రవేశం మీద స్థానిక CPM ఎమ్మెల్యే AN శమ్మీర్,పి శశి మరియు ఇళ్ళు దేశీయ బాంబు దాడి చేశారు శుక్రవారం రాత్రి. తలస్సేరిలో బీజేపీకి చెందిన ఎంపీ వి మురళీధరన్ ఇంటిపై కూడా బాంబులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు 801 కేసులు నమోదు చేయగా..1369 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







