న్యూ బోర్న్ బేబీస్ కోసం ఆక్టోపస్
- January 05, 2019
ఫుజారియాలోని ఓ ఆసుపత్రి నవజాత శిశువుల కోసం సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. ప్రీ మెచ్యూర్డ్ బేబీస్‌ని ఇంక్యుబేటర్‌లో ఉంచేందుకోసం ఆ ఇంక్యుబేటర్‌లో అదనంగా ఆక్టోపస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మెత్తటి ఊల్‌తో చేసిన ఈ ఆక్టోపస్ కారణంగా పిల్లలు ఇంకా తమ తల్లి గర్భంలోనే ఉన్నామన్న భావనతో ఆనందంగా గడుపుతారని వైద్యులు చెబుతున్నారు. తద్వారా బేబీస్ తొందరగా బయటి వాతావరణానికి అలవాటు పడతారని డాక్టర్ వాహిది చెప్పారు. ఇంక్యుబేటర్‌లో వినియోగించే వైర్లకు ఇబ్బంది లేకుండా, ప్రత్యేకంగా ఈ ఆక్టోపస్‌లను రూపొందించారు. 33 వారాల బేబీగాళ్కి తండ్రి అయిన మొహమ్మద్ ఆలీ మాట్లాడుతూ డాక్టర్ చెప్పేవరకూ ఈ విషయం గురించి తాము ఎక్కడా వినలేదనీ, తమ బేబీ ఇప్పుడెంతో ఆరోగ్యంగా ఉందనీ కొత్త పద్థతిలో వైద్య చికిత్సలు అందించడంతో పాటు, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన వాతావరణాన్ని కల్పిస్తున్నందుకు ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఫుజారియాలోని తుంబే హాస్పిటల్ ఈ ఆక్టోపస్‌లతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







