ఆల్ ఇండియా రేడియో మూసివేత
- January 05, 2019కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రసార భారతి కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా రేడియో జాతీయ ఛానల్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు జాతీయవార్తలు, కీలక విషయాలు వెల్లడించే ఆల్ ఇండియా రేడియో నేషనల్ ఛానల్ 1987లో ప్రారంభమైంది.
సరైన ఆదరణ లేకపోవడం ఛానల్ మూసివేతకు ఓ కారణం. ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్టు ప్రసార భారతి చెబుతోంది. అహమ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా అకాడెమీలను కూడా రద్దు చేయనున్నారు.
జాతీయ ఛానల్‌కు సంబంధించిన ట్రాన్స్మీటర్లు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. వీటితో ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో నెట్టుకురావడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రేక్షకాదరణ కూడా పెద్దగా లేని ఛానళ్లపై డబ్బులు ఖర్చు చేయడం కూడా సరైనది కాదని భావించే మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు ప్రసార భారతి అధికారులు చెబుతున్నారు.
ఇక్కడ పనిచేసిన సిబ్బందిని ఇతర చోట్లకు సర్దుబాటు చేయనున్నారు. ఇప్పటికే ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలను అవుట్ సోర్సింగ్ పద్దతితో నిర్వహిస్తున్నారు. వాళ్ళ వైబ్‌సైట్ ను కూడా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







