రిఫ్ఫాలో మోటరిస్ట్‌పై ఐరెన్‌ రాడ్‌తో దాడి.!

- January 05, 2019 , by Maagulf
రిఫ్ఫాలో మోటరిస్ట్‌పై ఐరెన్‌ రాడ్‌తో దాడి.!

ఆసియా జాతీయుడొకర్ని దాడి కేసులో అరెస్టు చేసినట్లు ఇంటీరియర్‌ మినిస్ట్రీ పేర్కొంది. సదరన్‌ గవర్నరేట్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రోడ్‌పై వెళ్తున్న ఓ వాహనంపై దాడికి దిగాడు. ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి కూడా ఆసియా జాతీయుడే. రిఫ్ఫా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. మరో ఘటనలో 58 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. సైకిల్‌ మీద వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో 58 ఏళ్ల బహరేనీ మృతి చెందాడు. షేక్‌ జబర్‌ అల్సబా స్ట్రీట్‌పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకో ఘటనలో 22 ఏళ్ల అరబ్‌ జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com