యూఏఈలో: 104 వాహనాల ఆక్షన్‌

యూఏఈలో: 104 వాహనాల ఆక్షన్‌

రస్‌ అల్‌ ఖైమా మునిసిపాలిటీ 104 అన్‌ క్లెయిమ్డ్‌ వాహనాల్ని ఆక్షన్‌కి పెట్టేందుకు రంగం సిద్ధం చేసింసది. ఆరు నెలలకు పైగా ఇంపౌండ్‌ అయిన వాహనాలు ఇవి. వీటి కోసం ఓనర్స్‌ ఎవరూ రాకపోవడంతో ఆక్షన్‌ వేయనున్నారు. రస్‌ అల్‌ ఖైమా మునిసిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌ ముంజిర్‌ బిన్‌ షుకర్‌ అల్‌ జాబి మాట్లాడుతూ, 104 వాహనాలు వివిధ ప్రాంతాలకు చెందినవని అన్నారు. పబ్లిక్‌ రోడ్స్‌, స్క్వేర్స్‌ మీద వాహనాల్ని ఓనర్లు వదిలి వెళ్ళినట్లు ఆయన వివరించారు. వార్నింగ్‌ లెటర్స్‌ వీటిపై అంటించినా ఎవరూ పట్టించుకోలేదనీ, 10 రోజుల తర్వాత వాటిని తొలగించామని చెప్పారు. చట్ట ప్రకారం నో క్లెయిమ్డ్‌ వాహనాల్ని ఆరు నెలల తర్వాత పబ్లిక్‌ ఆక్షన్‌ వేయాల్సి వుంటుంది. ఆక్షన్‌ తాలూకు వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. అయితే, వాహన యజమానులకు ఇంకొన్ని రోజులు సమయం వుందని అధికారులు అంటున్నారు. జరీమానా చెల్లించి వాహనాలు తీసుకెళ్ళొచ్చు. కొద్ది రోజుల క్రితం రస్‌ అల్‌ ఖైమా పోలీసులు, 1,518 వాహనాల్ని ఇంపౌండ్‌ చేసినట్లు వెల్లడించిన సంగతి తెల్సిందే. 

 

Back to Top