షాపింగ్‌ మాల్‌లో వీడియో: 5,000 దిర్హామ్‌ల జరీమానా

- January 10, 2019 , by Maagulf
షాపింగ్‌ మాల్‌లో వీడియో: 5,000 దిర్హామ్‌ల జరీమానా

అజ్మన్‌లో ఓ వ్యక్తి షాపింగ్‌ మాల్‌లో వీడియో తీసినందుకుగాను అతనికి 5,000 దిర్హామ్‌ల జరీమానా విధించారు. అంతే కాకుండా, అతని మొబైల్‌ ఫోన్‌ని కూడా స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థాంన ఆదేశించింది. అజ్మన్‌ చైనా మాల్‌లో, ఇద్దరు ఆసియా జాతీయులైన బాలికలు షాపింగ్‌ చేస్తుండగా, ఓ వ్యక్తి వారిని ఫోన్‌లో చిత్రీకరించాడు. అయితే, తాను ఆ అమ్మాయిల్ని షూట్‌ చేయలేదనీ, మాల్‌లో అలంకరణను షూట్‌ చేస్తున్న సమయంలో, వారు అక్కడికి వచ్చారని తన వాదనను నిందితుడు న్యాయస్థానంలో విన్పించారు. ఇతరుల అనుమతి లేకుడా వారి ఫొటోలు లేదా వీడియోలు తీయడం నేరంగా పరిగణిస్తారు. ఇటీవలే ఓ వ్యక్తి, ఓ మహిళ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టినందుకుగాను 150,000 జరీమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. దుబాయ్‌లో ఈ ఘటన జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com