'2.ఓ'కు అరుదైన గౌరవం

'2.ఓ'కు అరుదైన గౌరవం

శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ '2.ఓ' మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు అరుదైన గౌరవం దక్కబోతోంది. '2.ఓ'తో పాటు బాలీవుడ్ చిత్రం 'సంజు' ఏషియన్ సినిమా అవార్డ్స్ కు నామినేట్ చేయబడ్డాయి.

బెస్ట్ సినిమా, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్, ఒరిజినల్ మ్యూజిక్, బెస్ట్ స్క్రీన్ ప్లే వంటి ఆరు విభాగాల్లో పోటీ పడుతుంటే.. బెస్ట్ విఎఫ్ఎక్స్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో 2.ఓ పోటీ పడుతోంది. హాంకాంగ్ లో మార్చి 17 నుంచి ఈ వేడుక జరగనుంది.

Back to Top