ప్రముఖ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు..
- January 13, 2019
ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బాలీవుడ్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆరు నెలలుగా హిరాణీ తనను వేధించడంటూ ఆయన దగ్గర పనిచేసే సహయక దర్శకురాలు పలు ఆరోపణలు చేసింది. సంజయ్ దత్తు జీవితం అధారంగా నిర్మించిన సంజు సినిమాకు ఆమె హిరాణీ దగ్గర సహయక దర్శకురాలుగా పనిచేసింది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో హిరాణీ తనను లైంగికంగా వేధించారని ఆమె వెల్లడించింది.
- ADVT -
“హిరాణీ బాలీవుడ్లో పేరున్న దర్శకుడు కావడంతో ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. తను నా పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. అతని వల్ల నా మనస్సు శరీరం రెండు పాడైపోయాయి. వీటిన్నంటిని మౌనంగా భరించాను. ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగం పోతుందని భయంతో తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సి వచ్చింది” అంటూ సినిమా నిర్మాత విధు వినోద్ చోప్రాకు పంపిన మెయిల్లో తన ఆవేదనను వ్యక్తం చేసింది
ఆమె చేసిన ఆరోపణలను హిరాణీ ఖండించారు. ఈ వివాదంపై ఆయన తరపు న్యాయవాది ఆనంద్ దేశాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!