లేబర్ చట్టం ఉల్లంఘన: 2018లో 4,500 మంది వలసదారుల డిపోర్టేషన్
- January 14, 2019
మస్కట్: 4,500 మందికి పైగా వలసదారుల్ని 2018లో దేశం నుంచి డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. 5,000 మంది వరకు వలసదారుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. మొత్తంగా 4,557 మందిని 2018లో డిపోర్ట్ చేశారు. 5,413 మందిని అరెస్ట్ చేశారు. లేబర్ చట్టంలోని పలు నిబంధనల్ని వీరు ఉల్లంఘించారు. మే 6 నుంచి మే 12 మధ్య మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ 764 మందిని అరెస్ట్ చేసింది. 2018లో ఒకేసారి జరిగిన అరెస్టుల్లో ఇదే అత్యధికం. అక్టోబర్‌లో 672 మందిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్‌లో 636 మంది అరెస్టయ్యారు. అక్టోబర్‌లో 1,481 మందిని డిపోర్ట్ చేయగా, నవంబర్‌లో 1,078 మంది డిపోర్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..