పుట్టినరోజు సందర్భంగా విజయ్ సేతుపతి లుక్ విడుదల చేసిన 'సైరా'
- January 16, 2019మెగాస్టార్ చిరంజీవి - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సైరా నరసింహ రెడ్డి'. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా , బిగ్ బి అమితాబ్ బచ్చన్ , జగపతి బాబు , సుదీప్ , విజయ్ సేతుపతి వంటి స్టార్ నటి నటులు ఈ చిత్రం లో నటిస్తున్నారు. ఇప్పటికే 75 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి విజయ్ సేతుపతి లుక్ వచ్చేసింది.
చిత్రంలో నటిస్తున్న నటి నటుల పుట్టిన రోజునాడు వారి ఫస్ట్ లుక్ లను విడుదల చేస్తూ వారికీ బెస్ట్ విషెష్ ను అందిస్తూ వస్తున్నారు. బిగ్ బి , నయనతార పుట్టిన రోజు నాడు వారి లుక్ లు విడుదల చేయగా , ఈరోజు విజయ్ సేతుపతి పుట్టిన రోజు కావడం తో సైరా లో విజయ్ తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు.
ఇందులో విజయ్ రాజా పాండి అనే పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. వీరుడిలా కనిపిస్తున్న విజయ్ సేతుపతి లుక్ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ మ్యూజిక్ అందిస్తుండగా , ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం