భారతీయుడు -2 ఫస్ట్ లుక్ పోస్టర్
- January 16, 2019
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు శంకర్ భారతీయుడు-2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. 2 దశాబ్ధాల క్రితం ఇండియన్ సెల్యులాయిడ్‌పై సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా రూపొందనున్న భారతీయుడు-2 సినిమా జనవరి 18న సెట్స్‌పైకి వెళ్లనుంది. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమాలో తండ్రి సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మర్మకళతో అవినీతిపరులను అంతమొందించడం ఆ సినిమాను మిగతా చిత్రాలకన్నా ప్రత్యేకం చేసింది. తాజాగా విుదల చేసిన భారతీయుడు-2 ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనూ అదే మర్మకళను ప్రదర్శిస్తున్నట్టుగా వున్న స్టిల్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. వాస్తవానికి ఈ సినిమా గురించి గతేడాదే ప్రకటన వెలువడినప్పటికీ... తన రాజకీయ పార్టీ ప్రకటన, పార్టీ ఏర్పాటు పనులతో కమల్‌హాసన్ బిజీగా వుండగా మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.o సినిమాతో శంకర్ బిజీగా ఉండటంతో భారతీయుడు-2 మూవీ పట్టాలెక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. భారతీయుడు సీక్వెల్‌లో కమల్ సరసన కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోంది.
1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఏ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ఆ సినిమా పాటలన్నీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. కాగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కి యంగ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







