‘శ్రీదేవి బంగ్లా’లో అసలేం జరుగుతోంది: ఎందుకు బోనీ కపూర్ ఫైర్!!
- January 17, 2019
ఆమె టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది అక్కడ కూడా తన మార్క్ చూపించి నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలిగింది శ్రీదేవి. కానీ అర్థాంతరంగా బాత్‌టబ్‌లో పడిపోయి మరణించినట్లు వార్త. అభిమానులు ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోయారు. అందాల తార మరణంపై ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఇంకా అభిమానుల్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో మలయాళీ బ్యూటీ ప్రియా వారియర్ కన్నుగీటి తను నటించిన మొదటి చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమెతో బాలీవు్ దర్శక నిర్మాతలు ఓ సినిమా మొదలు పెట్టారు. ఆ చిత్రానికి శ్రీదేవి బంగ్లా అని టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై పెద్ద చర్చకు దారి తీసింది.
టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రియా ప్రకాష్ ఈ చిత్రంలో ఓ స్లార్ హీరోయిన్. ఆమె జీవితంలో ఒడిదుడుకులు, బాధలు, మద్యానికి బానిస కావడం ఇలాంటి అనేక ఆసక్తికర అంశాల తరువాత చివర్లో బాత్ టబ్‌లో పడిపోయినట్లుగా కాళ్లు మాత్రమే కనిపించే సీన్స్‌తో టీజర్ ముగించారు చిత్ర యూనిట్. అయితే ఈ టీజర్ తన భార్య శ్రీదేవి చివరి మజిలీకి దగ్గరగా ఉన్నాయని భావించిన బోనీ కపూర్ ఈ చిత్రంపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపించారు.
ఆ సినిమాలో ఏముందో ముందు తనకు చూపించిన తరువాతే సినిమాను విడుదలచేయాలని బోనీ నోటీసు సారాంశం. దానికి శ్రీదేవి బంగ్లా దర్శకుడు వివరణ ఇచ్చుకుంటూ హీరోయిన్‌గా మారిన శ్రీదేవి అనే ఓ యువతి కథతో ఈ సినిమా తీశామని అంతకు మించి ఏమీ లేదని చెబుతున్నారు. చిత్ర యూనిట్ కూడా సినిమాకు సంబంధించి ఏ విషయం క్లారిటీగా చెప్పడం లేదన్నది మాత్రం నిర్వివాదాంశం.
సెన్సేషన్ గా మారిన శ్రీదేవి బంగ్లా తర్వాత ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ప్రియా ప్రకాష్ తాను నటించిన రెండో చిత్రంతో కూడా విడుదలకు ముందే ఓ సెన్సేషన్‌ని క్రియేట్ చేయబోతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







