షార్జాలో వ్యక్తి హత్య
- January 17, 2019
46 ఏళ్ళ సుడానీ వ్యక్తి హత్యకు గురి కాగా 33 ఏళ్ళ భారతీయ మహిళ, ఆమె కుమార్తె తీవ్రంగా ఘాయపడిన ఘటన షార్జాలో జరిగింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. షార్జాలోని అల్ బుతినా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకోగానే సీఐడీ, ఫోరెన్సిక్ ఆఫీసర్స్ మరియు పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఓ మహిళ, ఆమె కుమార్తె అలాగే ఓ సుడానీ వ్యక్తి కన్పించారు. మరో సుడానీ వ్యక్తి చేతిలో కత్తితో పోలీసులకు చిక్కాడు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలోనే సుడానీ వ్యక్తి చనిపోగా, గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మహిళకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







