ప్రాణం తీసిన నిద్ర మత్తు
- January 17, 2019
26 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు ధయిద్ నుంచి షార్జాకి వెళుతుండగా బ్రిడ్జి నెంబర్ 10 వద్ద తన కారు ప్రమాదానికి గురికావడంతో ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆ యువకుడికి నిద్ర ముంచుకు రావడంతో నిద్ర మత్తులో కారుని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కారు అతి వేగంతో దూసుకుపోతోంది. ఈ కారణంగా పలు మార్లు కారు గాల్లోకి ఎగిరి, ఫ్లిప్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినా అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







