దుబాయ్:ఎన్టీఆర్ 23వ వర్థంతి సంధర్భంగా తెలుగు ప్రవాసీయులు ఘన నివాళి
- January 18, 2019
దుబాయ్:యూఏఈ లోని తెలుగు ప్రవాసీయులు ఎన్టీఆర్ వర్థంతి సంధర్భంగా అయన చేసిన ఘనతను స్మరించుకుంటూ ఓ తెలుగు బిడ్డ నిన్ను మరవదు ఈ తెలుగు గడ్డ బిడ్డలు అని గుర్తుచేసుకున్నారు. తెలుగుప్రజలేకాకుండా తమిళప్రజలు , కన్నడ ప్రజలు కూడా వర్థంతి జరుగుతున్న ప్రదేశాన్ని తెలుసుకుని స్వచ్చందంగా పాల్గొన్నారు . అయన చేసిన సేవలను తరతరాలకు గుర్తుండి పోయేలా ఉన్నాయని స్మరించుకున్నారు , దేశవిదేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నతి స్తానం దొరకడం కేవలం ఎన్టీఆర్ ఆనాడు చేసిన ఎన్నో పనులేనని తెలుగు ప్రజలు స్మరించుకున్నారు.
ఇప్పటికీ, రేపటికి, భవిష్యత్‌కి రైతుల కోసం ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. హెచ్‌పీకి రూ.50 తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, 2 రూపాయల బియ్యానికి శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆరే అని ప్రవాసీయులు కొనియాడారు. పరిపాలన అంటే ఏవిధంగా ఉండాలో ఎన్టీఆర్ చూపించారన్నారు. అధికారం కోసం ఆయన పార్టీ పెట్టలేదని, డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని పాల్గొన్న వక్తలు వ్యాఖ్యానించారు.




తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







