దోహా నుంచి కన్నూర్ - ఇండిగో డెయిలీ ఫ్లయిట్స్
- January 19, 2019
దోహా: ఇండియన్ లో కాస్ట్ క్యారియర్ ఇండిగో, ఖతార్ నుంచి ఇండియాలోని తమ తొమ్మిదవ డెస్టినేషన్‌కి విమానాల్ని ప్రారంభించనుంది. మార్చి 15 నుంచి ఈ రోజువారీ విమానం అందుబాటులోకి వస్తుంది. కేరళలోని కన్నూర్ విమానాశ్రయానికి కొత్తగా విమానాలు నడపనున్నట్లు ఇండిగో పేర్కొంది. 2018 డిసెంబర్ నుంచి కన్నూర్ విమానాశ్రయం ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారంలో రెండు రోజులపాటు సర్వీసుల్ని దోహా - కన్నూర్ సెక్టార్‌లో నడుపుతోంది. ఇండిగో నడిపే విమానాలు దోహాలో రాత్రి 10.05 నిమిషాలకు బయల్దేరి, కన్నూర్‌కి ఉదయం 4.55 (స్థానిక సమయం) నిమిషాలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కన్నూర్ నుంచి రాత్రి 7.05 నిమిషాలకు ప్రారంభమై, దోహాలో రాత్రి 9.05 నిమిషాలకు చేరుకుంటుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







