మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం..66 మంది సజీవ దహనం
- January 20, 2019
మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రో పైప్‌లైన్ పేలడంతో 66 మంది సజీవ దహనమయ్యారు. మరో 76 మందికిపైగా జనం తీవ్రంగా గాయపడ్డారు. పైప్‌లైన్ లీకవడంతో ఇంధనాన్ని తెచ్చుకునేందుకు స్థానికులు పోటీపడుతున్న సమయంలో పేలుడు సంభవించింది. దీంతో చాలామంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మెక్సికో సిటీలోని త్లాహులిల్పాన్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో కొందరు దొంగలు పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఇంధనాన్ని తెచ్చుకునేందుకు పోటీ పడ్డారు. అదే సమయంలో పైప్‌లైన్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 66 మంది సజీవదహనమయ్యారు. 76 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హిడాల్గో స్టేట్ గవర్నర్ ఒమర్ ఫయద్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..