ఆర్థిక సంక్షోభం..స్తంభించిన ప్రభుత్వ కార్యకలాపాలు

- January 20, 2019 , by Maagulf
ఆర్థిక సంక్షోభం..స్తంభించిన ప్రభుత్వ కార్యకలాపాలు

వాషింగ్టన్‌ : ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించి నాలుగు వారాలు అవుతోంది. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధుల మంజూరు విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు, అమెరికా కాంగ్రెస్‌లోని డెమోక్రాట్లకు మధ్య తలెత్తిన వివాదం ప్రభుత్వ ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది. మూడు రోజుల వారాంతపు శలవుల నిమిత్తం డెమోక్రాట్ల నేతృత్వంలోని ప్రతినిధుల సభ సభ్యులు నగరం వీడి వెళ్ళారు. వారు మంగళవారం వస్తారని శుక్రవారం సెనెట్‌ సమావేశమవుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. రిపబ్లికన్ల అదుపులో గల సెనెట్‌ సభ్యులు ఇటీవల కాలంలో ప్రతినిధుల సభ ఆమోదించిన పలు బిల్లులను ఆమోదించలేదు. దాంతో కార్యకలాపాల నిర్వహణకు అవససరమైన నిధుల కొరత ఏర్పడింది. అమెరికా చరిత్రలోనే ఇంతకాలమూ ఇలా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడం జరగలేదు. ఇది పరిష్కారం కావడానికి మరో వారం పట్టేలా వుంది.

అంటే 8లక్షల మంది ఉద్యోగులు మరో వారం రోజుల పాటు జీతాలు అందక ఇబ్బందులు పడాల్సి వుంటుంది. శుక్రవారం నుండి ప్రభుత్వ విమాన సర్వీసులు కూడా నిలిపివేశారు. వైట్‌హౌస్‌ అనుమతి లేకుండా, చట్టసభల ప్రతినిధులు పర్యటనలు జరపకుండా వుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తలెత్తిన వివాదం పరిష్కారమవకుండా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లేందుకు విమానాన్ని అందచేసేందుకు ప్రభుత్వం తిరస్కరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com