జూనియర్ బచ్చన్ ఉన్నాడంటూ అంచనాలు పెంచేస్తున్న భారతీయుడు 2

- January 21, 2019 , by Maagulf
జూనియర్ బచ్చన్ ఉన్నాడంటూ అంచనాలు పెంచేస్తున్న భారతీయుడు 2

కమల్ హాసన్ కెరీర్ లోనే విలక్షణ చిత్రంగా నిలిచింది భారతీయుడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ఇటివలే ఈ సినిమా ప్రీ-లుక్ రిలీజ్ చేశాడు దర్శకుడు శంకర్. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ జూనియర్‌ బచ్చన్‌ అభిషేక్‌ నటించనున్నారని టాక్. ఈ చిత్రంలో అభికి పవర్‌ఫుల్‌ పాత్ర దక్కినట్లు తెలుస్తోంది.

తన పాత్ర గురించి వినగానే అభిషేక్‌ వెంటనే ఒప్పేసుకున్నారట. మరోపక్క బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అక్షయ్‌కుమార్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఇందులో ఆయన విలన్‌ పాత్రలో నటించే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇందులో కమల్‌ హాసన్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్‌ పతాకంపై సుభాస్కరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ మ్యూజిక్. 2019 ద్వితియార్ధంలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com