శివకుమార స్వామి చివరి కోరిక ఏమిటో చూడండి..
- January 22, 2019
కర్ణాటకలోని తుముకూరు సిద్దగంగ మఠాథిపతి శివకుమార స్వామి సోమవారం(జనవరి22, 2019) శివైక్యం అయ్యారు. శివకుమార స్వామిజీని అందరూ నడిచే దేవుడిగా పూజిస్తారు. లక్షల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యం, భోజస, వసతి సదుపాయాలు కల్పించే శివకుమార స్వామీజీని కర్ణాటక ప్రజలు తమ గుండెళ్లో పెట్టుకొని పూజిస్తారు. సిద్దగంగ మఠంలో ఆయన చికిత్స పొందుతున్న సమయంలో చివరిసారిగా కోరిన ఓ కోరిక గురించి తెలిస్తే అందరి కళ్లల్లో కన్నీళ్లు తిరగడం ఖాయం. తనకు భారత్న రత్ర ఇవ్వమనో మరో పురస్కారం ఇవ్వమనో ఆయన కోరుకోలేదు.
సిద్దగంగా మఠం జూనియర్ స్వామీజితో....నేను శివైక్యం చెందే సమయం ఏక్షణంలోనైనా కావొచ్చు... ఉదయం అయితే పిల్లలందరూ టిఫిన్ చేసిన తర్వాత, ఒకవేళ మధ్యాహ్నాం, రాత్రి అయితే పిల్లలు భోజనం చేసిన తర్వాత నా శివైక్యం విషయాన్ని ప్రస్తావించండి అని జూనియర్ స్వామీజీని ఆదేశించాట. సోమవారం ఉదయం 11.44గంటలకు స్వామీజీ శివైక్యం చెందిన సమయంలో మఠంలో పిల్లలు భోజనం చేస్తున్నారు. స్వామీజీ చివరి కోరిక మేరకు పిల్లలు భోజనం చేసిన తర్వాతే ఆయన శివైక్యం చెందినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పిల్లలందరూ భోరున విలపిస్తూ మఠంవైపు పరుగులు తీశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..