హలాల్‌ ఫెస్టివల్‌కి సిద్ధమవుతున్న కటారా

- January 22, 2019 , by Maagulf
హలాల్‌ ఫెస్టివల్‌కి సిద్ధమవుతున్న కటారా

ఖతార్‌ ట్రెడిషనల్‌ హెరిటేజ్‌ మరియు కల్చర్‌ని చాటి చెప్పేలా కల్చరల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ కటారా ఎనిమిదవ హలాల్‌ (లైవ్‌ స్టాక్‌) ఫెస్టివల్‌కి రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 2న ఈ ఫెస్టివల్‌ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు సాగే ఈ ఫెస్టివల్‌ రీజియన్‌లోనే అతి పెద్దది. దేశంలో లైవ్‌ స్టాక్‌ సెక్టార్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకోసం ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. లైవ్‌ స్టాక్‌ ఆక్షన్‌, గోట్స్‌ మరియు షీప్స్‌లో బెస్ట్‌ బ్రీడ్స్‌ని పరిచయం చేయడం వంటివి ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com