పూరీ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్
- January 23, 2019
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్‌లతో ఇబ్బందిపడుతున్నాడు. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' అనే ఫిల్మ్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఒపెనింగ్ షాట్ వంటివి బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. దీనికి ఇండస్ర్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతోనైనా సరైన హిట్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు పూరీ.
ఆ మధ్య దీనికి సంబంధించి ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్ విడుదలైంది. దీంతో అంచనాలు భారీగానే పెరిగాయి. ఇందులో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ని తీసుకోవాలని భావిస్తున్నాడట. ఆమెని సంప్రదించి మాట్లాడడం కూడా జరిగిపోయిందని టాక్. అనుతోపాటు మరో హీరోయిన్‌కీ ఇందులో నటించే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే మే లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది పూరి ప్లాన్. ఈ ప్రాజెక్టుకి ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







