ఈ వేదిక నుంచి తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని స్పష్టం చేసిన నాగబాబు
- January 23, 2019
హైదరాబాద్: చిన్నపిల్లలు దేవుడులాంటి వారనీ, వాళ్లకు కల్లాకపటం తెలియదని చిన్నప్పుడు ఓ పాట వినేవాళ్లమని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. పిల్లలు ఎప్పుడూ నిజాలే మాట్లాడుతారనీ, చెడుమాటలు ఉండవని వ్యాఖ్యానించారు. తాను 'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను పెట్టానని పేర్కొన్నారు. ఈ వేదిక నుంచి తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ నిర్వహించిన ఓ సభలో 'ఎలాంటి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది టీడీపీనే' అంటూ లోకేశ్ పొరపాటున చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఈ వీడియోలో ప్రస్తావించారు. 'ఇంత నిజాయతీగా ముందుకు వచ్చి మీ పార్టీ గురించి నిజాలు చెప్పినందుకు థ్యాంక్యూ లోకేశ్ గారూ' అని చెప్పారు. ఇంత నిజాయతీగా ఉండటం దేశంలోని ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యం కాదని కితాబిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







